: నాకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ: పవన్
నిజామాబాద్ లో ప్రారంభమైన బీజేపీ 'భారత్ విజయ్ ర్యాలీ' బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం మొదలైంది. తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ఎలా వచ్చిందనే విషయం కన్నా వచ్చిన తెలంగాణను ఎలా పాలించాలనే దానిపైనే మాట్లాడుకోవాలని చెప్పారు. తాము పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని కొందరు చెబుతున్నారని... కానీ, కొందరు యువకుల బలిదానాలు, పోరాటాల వల్లే తెలంగాణ సాధ్యమైందని పరోక్షంగా టీఆర్ఎస్ పై సెటైర్ విసిరారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు చనిపోతుంటే తెలంగాణ ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కులాలు, మతాలన్నింటికీ సమాన న్యాయం చేయడమే జనసేన సిద్ధాంతమని వెల్లడించారు.