: నా భర్తను రాజకీయాలకు లక్ష్యంగా చేసుకున్నారు: ప్రియాంక


తన భర్త రాబర్ట్ వాద్రాపై, తన కుటుంబంపై రాజకీయ విమర్శల వల్ల బాధకు లోనయ్యానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక చెప్పారు. అయినప్పటికీ ప్రత్యర్థులపై పోరాడతానని ఆమె ప్రకటించారు. ' మా కుటుంబం, నా భర్త విషయంలో చాలా పరుషమైన పదాలు వాడారు. మా కుటుంబాన్ని అవమానించాలని చూస్తున్నారు. ఇది చాలా బాధాకరం. కానీ వీటిని ఎలా తట్టుకోవాలో నాయనమ్మ ఇందిర వద్ద నేర్చుకున్నా' అంటూ ప్రియాంకాగాంధీ చెప్పారు. ఈ మేరకు ఆమె రాయ్ బరేలీలో ఈ రోజు మాట్లాడారు. నా భర్తను అపఖ్యాతి పాల్జేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. తమను అపఖ్యాతి పాల్జేయాలనుకుంటే తన నుంచి గట్టి స్పందన ఎదురవుతుందని రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News