: ముస్లింల టోపీ పెట్టుకోనంత మాత్రాన మోడీ చెడ్డవ్యక్తి కాదు: మదానీ
ముస్లింల ప్రముఖ మతగురువు మహమూద్ మదానీ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి మద్దతుగా మాట్లాడారు. గోద్రా దుర్ఘటన అనంతరం 2002లో గుజరాత్ లో జరిగిన మత అల్లర్లకు మోడీ క్షమాపణ చెప్పననడం, గతంలో ముస్లింల టోపీ గౌరవ పూర్వకంగా ధరించాలని కోరినా ఆయన ధరించకపోవడం తెలిసిందే. దీనిపై మదానీ మాట్లాడుతూ... టోపీ ధరించనంత మాత్రాన మోడీ చెడ్డ వ్యక్తేం కాదన్నారు. ఎంతో మంది టోపీలు ధరించి ముస్లింలను ఫూల్స్ ను చేస్తున్నారని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గోద్రా అల్లర్లలో మోడీ తప్పుంటే ఆయన్ను శిక్షించాలని, క్షమాపణతో ఒరిగేదేం లేదన్నారు. ముస్లింలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని మోడీకి మదానీ సూచించారు.