: ట్విట్టర్ లో మోడీ, రచయిత చేతన్ భగత్ ల 'సెల్ఫీ' ఫొటో


ఇటీవల కాలంలో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో 'సెల్ఫీ' ఫొటో (సొంతంగా తీసుకునేది) హల్ చల్ అంతాఇంతా కాదు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల నుంచే ఈ హవా మొదలైంది. ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఇలాంటి ఫొటోలను లక్షలకొద్ది ఉంచుతున్నారు. తాజాగా, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలుసుకున్న సమయంలో రచయిత చేతన్ భగత్ కూడా ఓ సెల్ఫీ ఫొటో తీసుకున్నాడు. దాన్ని మోడీనే అప్ లోడ్ చేశారు. అంతేకాదు, నేడు చేతన్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు కూడా తెలిపారు. అంటే మోడీగారికి కూడా ఈ సెల్ఫీ వైరస్ పాకిందన్నమాట.

  • Loading...

More Telugu News