: చిరంజీవి ప్రచార హోరు నేటి నుంచే
కేంద్ర మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ అయిన చిరంజీవి... నేటి నుంచి నిరాటంకంగా 11 రోజుల పాటు సీమాంధ్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు విశాఖ సమీపంలోని గాజువాకలో చిరంజీవి తన ప్రచారానికి శ్రీకారం చుడతారు. 23న చోడవరం, అనకాపల్లి, విశాఖలో రోడ్ షో ఉంటుంది. 24న కాకినాడ, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో, 25న ఏలూరు, కొయ్యలగూడెం, గోపాలపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నంలో ప్రచారం నిర్వహిస్తారు. 26న విజయవాడ లోక్ సభ పరిధిలో, 27న తెనాలి, గుంటూరు, 28న బాపట్ల, 29న నెల్లూరు, 30న చిత్తూరు లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మే 1న రాజంపేట, కర్నూలు, మే 2న అనంతపురం లోక్ సభ నియోజకవర్గాల్లో చిరంజీవి పర్యటన కొనసాగుతుంది.