: ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు: షర్మిల
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ నేత షర్మిల అన్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. మెదక్ జిల్లా జహీరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ... వైఎస్సార్ ప్రజల మనిషి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వదిలేసిందని, ఈ విషయంపై టీడీపీ, బీజేపీలు ఒక్క రోజు కూడా నిలదీయలేదని ఆమె విమర్శించారు.