: నారా లోకేష్ పై దాడి కేసులో ఇద్దరు అరెస్ట్
టీడీపీ యువ నేత నారా లోకేష్ పై దాడి కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరులో ఆదివారం రాత్రి లోకేష్ కాన్వాయ్ పై ఇద్దరు మద్యం సీసాలతో దాడి చేసిన విషయం విదితమే. నిందితులు శివసాయి, ఎల్లారెడ్డిలపై కేసు నమోదు చేసి... ఇవాళ కోర్టులో హాజరుపరిచినట్లు పెబ్బేరు ఎస్సై ఉమా మహేశ్వరరావు తెలిపారు.
కాగా, లోకేష్ కాన్వాయ్ పై దాడికి యత్నించినందుకు ప్రతీకారంగా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ప్రతి దాడులకు దిగారు. టీఆర్ఎస్ నేతలకు చెందిన కారును దగ్ధం చేసిన 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు అయింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.