: ఊపిరి పీల్చుకున్న పార్థసారధి ... నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఆమోదం


మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్థసారధి నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రఘునందన్ రావు ఆమోదించారు. ఫెమా కేసుకు సంబంధించి ఆర్థిక నేరాల కోర్టు పార్థసారధికి జైలు శిక్ష, జరిమానా విధించిందని టీడీపీ నేత కోనేరు సురేష్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దాంతో ఫెమా కేసుకు సంబంధించిన పత్రాలను చూపేందుకు పార్థసారధికి సాయంత్రం 5.30 గంటల వరకు సమయం ఇచ్చారు. ఆ సమయంలోనే పార్థసారధి ఫెమా కేసుకు సంబంధించి తగిన పత్రాలు చూపడంతో రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ ను ఆమోదించారు.

  • Loading...

More Telugu News