: మోడీ సభలో బాబు, పవన్ పాల్గొంటారు: జవదేకర్
హైదరాబాబ్ లో రేపు జరగనున్న నరేంద్ర మోడీ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఆయన ఈరోజు హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈ ఎన్నికల్లో ఎన్డీయే విజయం ఖాయమన్నారు. బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. చాయ్ వాలాపై వ్యాఖ్యలు బెడిసికొట్టడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని విమర్శించారు.