: గర్ల్ ఫ్రెండ్స్ కోసం బ్యాంకులకు కన్నం


ఓ మాజీ సైనికుడు దారి తప్పాడు. ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ కోసం విలాసవంతంగా ఖర్చు పెట్టేందుకు బ్యాంకు దోపిడీలకు పాల్పడుతూ చివరికి పోలీసులకు చిక్కాడు. హిమాచల్ ప్రదేశ్ లోని సోహాన్ పోలీసులు అతడిని తాజాగా అరెస్ట్ చేశారు. షియోపూర్ లో యూకో బ్యాంకు నుంచి 36 లక్షల రూపాయలు దోచుకొని పారిపోతుండగా, అనిల్ రాజ్ వత్ అనే నిందితుడిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని తెల్లబోయారు. ఆర్మీలో 7 సంవత్సరాలపాటు అతడు పనిచేశాడు. ఆ సమయంలో దోపిడీలకు పాల్పడే టెక్నిక్ లు నేర్చాడు. తర్వాత దోపిడీలు మొదలుపెట్టాడు. యూకో బ్యాంకు దోపిడీకి ముందు తాను 9 బ్యాంకుల్లో లూటీ చేసినట్లు అతడు వెల్లడించాడు. దోచుకున్నదంతా తన గర్ల్ ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెట్టేవాడినని, చేతులో డబ్బులు అయిపోగానే మరో బ్యాంకు దోపిడీ చేసేవాడినని అతడు తెలిపాడు. ఈ దొంగతనాల్లో తాను ఇద్దరు స్నేహితుల సాయం కూడా తీసుకునేవాడినని బయటపెట్టాడు.

  • Loading...

More Telugu News