: గవర్నర్ తో సీఎస్ మహంతి భేటీ
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, కేంద్ర ప్రభుత్వ అధికారి కమలనాథన్ భేటీ అయ్యారు. విభజనకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, ఈ సాయంత్రం మహంతి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై ఈ నెల 24న జరిగే నిపుణుల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు.