: ధర్డ్, ఫోర్త్ ఫ్రంట్ లు సక్సెస్ కావు: వెంకయ్యనాయుడు
దేశంలో ధర్డ్, ఫోర్త్ ఫ్రంట్ లు విజయవంతమయ్యే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు బల్లగుద్ది చెబుతున్నారు. విజయవాడలో టీడీపీ, బీజేపీ నేతలతో సమావేశమైన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, టీడీపీ పొత్తు రాష్ట్రానికి చాలా అవసరమన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ హవా నడుస్తోందని, ఆయన నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని పేర్కొన్నారు.