: లో బ్లడ్ షుగర్ తో దాంపత్యానికి ముప్పు!


రక్తంలో చక్కెర శాతం తగ్గితే (లో బ్లడ్ షుగర్) దాంపత్య జీవనానికి ముప్పేనని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చక్కెర నిల్వలు తగ్గినపుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరని, దాంతో భాగస్వామిపై అరుస్తారని పరిశోధనల్లో తేలింది. 107 జంటలపై 21 రోజులు ప్రయోగం చేసి ఈ విషయాలను కనుగొన్నామని ఓహియో వర్శిటీకి చెందిన బ్రాడ్ బుష్ మాన్ తెలిపారు.

పరిశోధనలో భాగంగా ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు, రాత్రి పడుకోబోయే ముందు బ్లడ్ షుగర్ స్థాయులను పరీక్షించి, నమోదు చేయమని ఆ జంటలకు చెప్పామని ఆయన అన్నారు. అలాగే, వారికి ఓ బొమ్మ, కొన్ని గుండు సూదులను ఇచ్చి భాగస్వామిపై కోపం వచ్చినప్పుడు ఆ బొమ్మపై వాటిని గుచ్చాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఆ తర్వాత పరిశీలిస్తే బ్లడ్ షుగర్ నిల్వ తగ్గినప్పుడు కోపం పట్టలేకపోతున్నారని ఈ పరిశోధనల్లో వెల్లడైంది.

  • Loading...

More Telugu News