: పెళ్లి కోసం పడరాని పాట్లు పడుతోన్న అమెరికన్ నటి కిమ్ కర్దషియాన్!


వచ్చే నెలలో పెళ్లికి సిద్ధమవుతున్న అమెరికన్ టీవీ నటి కిమ్ కర్ధషియాన్ తన బరువు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతోందట. పెళ్లికి ముందే కనీసం ఎనిమిది కిలోల బరువు తగ్గేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతంలో బరువు పెరగడానికి డైట్ తీసుకున్న కిమ్, ఇప్పుడు పెళ్లికి ముందు బరువు తగ్గడానికి ఆకుపచ్చ రంగు కూరగాయలు, అధిక పరిమాణంలో నీరు తాగి కడుపు నింపుకుంటోంది. వచ్చే నెలలో ఆమె కన్యె వెస్ట్ ను పెళ్లాడనుంది. నీళ్లు తప్ప మరే పానీయమూ తాగడానికి ఆమె ససేమిరా అంటోంది. వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తున్న కిమ్... బ్రెడ్, పాస్తా, కార్బొహైడ్రేట్స్ వంటి వాటిని పూర్తిగా నిషేధించిందని సమాచారం.

  • Loading...

More Telugu News