: ఆదాయ, వ్యయ నివేదికలు అందించని పార్టీలపై ఈసీ చర్యలు


నిర్ణీత కాలంలో వ్యయానికి సంబంధించిన నివేదికలను అందించని రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా 10 పార్టీలకు పన్ను మినహాయింపును రద్దు చేయాలని ఈసీ యోచిస్తోంది. వైఎస్సార్సీపీ 2012-13 సంవత్సరానికి ఆదాయ వ్యయ వివరాలను ఇవ్వలేదని, వివరాలు అందజేయని పార్టీలను డిఫాల్టర్లుగా పరిగణించాలని ఈసీ సూచించింది. రాష్ట్రీయ మహిళా జనశక్తి, లోక్ తాంత్రిక్ పార్టీ, ఇండియన్ పీపుల్ గ్రీన్ పార్టీ, ధర్మరాజ ప్రకాష్ పార్టీ తదితరాలపై ఈసీ చర్యలు తీసుకోనుంది. ఇంతవరకు వివరాలు అందజేయని రాజకీయ పక్షాలకు ఐటీ శాఖ సమన్లు జారీ చేస్తోంది. ఆదాయపన్ను చట్టం సెక్షన్ 29సి కింద చర్యలకు సీబీడీటీని ఎన్నికల సంఘం కోరింది.

  • Loading...

More Telugu News