: ప్రయాణికుల దాహార్తిపై ఎమ్మెల్సీ నాగేశ్వర్ దీక్ష


వేసవిలో ప్రయాణికుల అవస్థలపై ఎమ్మెల్సీ నాగేశ్వర్ పోరు సాగిస్తున్నారు. దాహం తీర్చేందుకు బస్టాండ్లలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయండి మహాప్రభో అని కోరినా, ఆర్టీసీ అధికారుల తీరులో ఏ మార్పు లేకపోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది.

దీంతో హైదరాబాద్ లోని బస్ భవన్ ముందు ఆయన ఆందోళన చేస్తున్నారు. 50 లక్షలు కేటాయించినా వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు అధికారులు సహకరించడం లేదని నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ ఖాన్ లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముందు బైఠాయించారు. 

  • Loading...

More Telugu News