: అతిధి పాత్రలో కనిపించనున్న మిచెల్లీ ఒబామా!
అమెరికన్ మ్యూజికల్ డ్రామా సిరీస్ ‘నాష్ విల్లే’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిచెల్లీ ఒబామా అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారు. మే 7వ తేదీన ప్రసారం కానున్న ఏబీసీ డ్రామా ఎపిసోడ్ లో యూఎస్ ప్రథమ పౌరురాలు మిచెల్లీ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కోని బ్రిటన్ సరసన మిచెల్లీ నటించనున్నారని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది.
ఇక ముందు ఇలాంటి పాత్రలు చేస్తానని అనుకోవడం లేదని, దేనికి వెనుకంజ వేయడం తన నైజం కాదని మిచెల్లీ అన్నారు. ఏది మంచి అనుకుంటే దాన్ని మహిళలు స్వీకరించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఒకరు ఆప్ఘనిస్తాన్ లో గాయపడటంతో మిచెల్లీకి ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఓ చారిటీ షోలో పాల్గొనాల్సిన మిచెల్లీ ఈ కార్యక్రమంలో నటించేందుకు అంగీకరించారు.