: ప్రియాంక కోసం కాంగ్రెస్ లో పదవి ఖాళీగా లేదు: థరూర్
కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి శశి థరూర్ ప్రియాంకాగాంధీని తక్కువ చేసేలా మాట్లాడారు. ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ లో నాయకత్వ పదవి ఖాళీగా లేదన్నారు. ప్రియాంక, ఆమె భర్త వాద్రా కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శశిథరూర్ మాట్లాడారు. కాంగ్రెస్ కు అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడు ఉన్నారని, వారు చాలా ఉత్సాహంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ లో అమేధీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల్లో ప్రియాంక ప్రచారం చాలా సానుకూల ప్రభావం చూపిస్తోందన్నారు.