: రేపల్లెకు బాబు వరాల జల్లు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపల్లె పర్యటన సందర్భంగా వరాల జల్లు కురిపించారు. గుంటూరు జిల్లా రేపల్లెలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెద్దఎత్తున పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. మహిళల రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఫించనుల మొత్తాన్ని పెంచుతామని పేర్కొన్నారు. రేపల్లెలో డ్రైనేజి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేస్తామని అన్నారు. మచిలీపట్నం-రేపల్లె మధ్య రైల్వే ట్రాక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News