: చీపురుపల్లి అసెంబ్లీకి బొత్స నామినేషన్
చీపురుపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆయన వెంట భార్య బొత్స ఝాన్సీ కూడా ఉన్నారు. అనంతరం అభిమానులు, అనుచరులతో భారీ ర్యాలీ చేపట్టిన వారు ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. స్వార్థంకోసం కొందరు పార్టీని వీడుతున్నారని.. కానీ, సీమాంధ్రకు న్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆమె చెప్పారు. అన్ని పార్టీలు కోరిన తర్వాతే రాష్ట్ర విభజన జరిగిందని తెలిపారు.