: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి
ఎన్నికల సమరంలో ఊహించని ట్విస్ట్. జేఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి కిరణ్ ఈ రోజు నామినేషన్ వేస్తారని ఇంతకు ముందు ప్రకటించారు. అయితే ఊహించని విధంగా పోటీకి ఆయన దూరంగా ఉండిపోయారు. ఆయన స్థానంలో ఆయన సోదరుడు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి కిరణ్ కూడా హాజరయ్యారు.