: పురందేశ్వరి విషయంలో టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేదు: వెంకయ్యనాయుడు


టీడీపీ, బీజేపీల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పురందేశ్వరికి రాజంపేట ఎంపీ టికెట్ కేటాయించడంపై టీడీపీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదని తెలిపారు. ఎర్రంనాయుడు కుటుంబం కోరిక మేరకే ఇచ్ఛాపురం అసెంబ్లీ సీటును టీడీపీకి ఇచ్చామని వెల్లడించారు. ఈరోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్త అదానీకి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి సంబంధం లేదని... ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకమని ఆరోపించారు.

  • Loading...

More Telugu News