: చిరంజీవిని కలవాలంటే నాకే అపాయింట్ మెంట్ కావాలి: సినీనటి హేమ


కేంద్ర మంత్రి చిరంజీవిని కలవాలంటే అపాయింట్ మెంట్ కావాలని, అలాంటి ఆయన ప్రజలకు ఏ రకంగా సేవ చేస్తారని సినీ నటి, మండపేట జేఎస్పీ అభ్యర్థి హేమ ప్రశ్నించారు. మండపేటలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడం ప్రచారం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను స్థానికంగా ఉంటూనే యువత ఉపాధికి బాటలు వేస్తానని అన్నారు. మహిళా సాధికారతకు పాటుపడతానని హేమ స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ హర్షకుమార్ అంటే ఉన్న అభిమానమే తనను జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు పురికొల్పాయని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News