: వైభవంగా 'బాద్ షా' హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్
జూనియర్ ఎన్టీఆర్ కాజల్ ప్రధాన తారాగణంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `బాద్ షా`. భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం హెక్సా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్ దసపల్లా హోటల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు తదితర చిత్రసీమ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
సిద్దార్థ్, నవదీప్ వంటి హీరోలతోపాటు 50మంది ప్రముఖ నటీనటులు పాలుపంచుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5వతేదీన వెండితెరలను తాకనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం. సినిమాటోగ్రఫీ కెవి గుహన్