: టీడీపీతో కలసి పనిచేస్తా: పురంధేశ్వరి
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు వివాదం సమిసిపోయిందని... ఎన్నికల్లో టీడీపీతో కలసి పనిచేస్తామని రాజంపేట లోక్ సభ బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ రాయలసీమకు దత్తపుత్రుడని... ఆయనను ఆదరించినట్టే తనను కూడా ఆదరించాలని కోరారు. ఎన్టీఆర్ కూతురుగా పుట్టడం తాను చేసుకున్న సుకృతమని చెప్పారు. అధిష్ఠానం ఆదేశం మేరకే తాను రాజంపేట నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు.