: నేడు జైసపా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్?
జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు పీలేరు వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. నామినేషన్ వేసిన అనంతరం అక్కడే రోడ్ షోలో పాల్గొని రాత్రికి కలికిరిలో బస చేస్తారు. 20, 21 తేదీల్లో సీమాంధ్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం 22 న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.