: ‘జగన్ బాణం’ హైదరాబాదుకు దూసుకొస్తోంది!
‘జగన్ బాణం’ హైదరాబాదు వైపుకు దూసుకొస్తోంది. వైఎస్ జగన్ సోదరి షర్మిల హైదరాబాదు, మెదక్ జిల్లాలలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆమె ఈనెల 20 నుంచి 22 వరకూ ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు కొనసాగే ఆమె ఎన్నికల ప్రచారానికి గాను ఈ రోజు షెడ్యూల్ ను ఖరారు చేశారు. 20వ తేదీన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్ నగర్, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, శేరిలింగంపల్లిలోని సభల్లో షర్మిల పాల్గొంటారు. అనంతరం 21వ తేదీన మెదక్ జిల్లాలో ఆమె పర్యటన కొనసాగుతుంది.
మెదక్ జిల్లాలోని నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరువుల మీదుగా ఆమె రోడ్ షో నిర్వహిస్తారు. ఏప్రిల్ 22న కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, సికింద్రాబాదు, ఎల్.బి.నగర్ లో ఏర్పాటు చేయనున్న పలు సభల్లో షర్మిల ప్రసంగిస్తారు.