: పీవీపీకి పరేషాన్!
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్న పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కి మరోసారి ఆశాభంగం ఎదురైంది. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే మద్దతివ్వలేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. దాంతో పవన్ మద్దతు లేకుండా పోటీ చేసేందుకు పీవీపీ జంకుతున్నట్లు తెలిసింది. ముందుగా రేపు మధ్యాహ్నం 12.30కి నామినేషన్ వేయాలని పీవీపీ నిర్ణయించుకున్నా... తాజా పరిణామాల నేపధ్యంలో పోటీ నుంచి తప్పుకునే యోచనలో ఆయన ఉన్నారు.