: 'అప్పుడు నేను వెేసుకున్న డ్రెస్ ఏంటి?' అంటూ నాగార్జునను అడిగిన అమల


చాలా మందికి కలలు ఉంటాయని, ఆ కలలను నిజం చేయడానికే తాను బుల్లితెర పైకి వస్తున్నానని అక్కినేని నాగార్జున అన్నారు. హైదరాబాదులో కౌన్ బనేగా కరోడ్ పతి (మీలో కోటీశ్వరులు ఎవరు) టీవీషో క్విజ్ షో ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమితాబ్ స్థాయిని తగ్గనివ్వకుండా క్విజ్ షోను రక్తి కట్టిస్తానని అన్నారు. ఈ సందర్భంగా నాగార్జున అర్థాంగి అమల ఆయనను గెస్ట్ గా పెట్టి, హోస్ట్ గా వ్యవహరిస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారు.

'మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు నేను వేసుకున్న డ్రెస్ రంగు ఏంటి?' అంటూ అమల ప్రశ్న సంధించింది. 'నాగ చైతన్య చదివిన స్కూల్ పేరు ఏంటి?', 'తొలి సారి నన్ను షాపింగ్ కు తీసుకెళ్లిన తేదీ ఏంటి?', 'నేను రాజకీయాల్లోకి వెళ్తానని మీడియా ప్రచారం చేస్తున్న పార్టీ ఏది?' అంటూ చకాచకా ప్రశ్నలు అడిగారు. దీనికి నాగార్జున చకచకా సమాధానాలు చెప్పారు.

  • Loading...

More Telugu News