: రూ.760కోట్ల పన్ను వసూలు చేసిన జీహెచ్ఎంసీ


ఇవాళ్టితో ముగిసిన 2012-13 ఆర్థిక సంవత్సరానికి హైదరాబాద్ మహానగర పాలక సంస్థకు పన్నుల రూపంలో రూ. 760 కోట్లు వసూలయ్యాయి. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నివేదిక విడుదల చేశారు. గతేడాది మొత్తం పన్నుల వసూళ్లు రూ. 634 కోట్లు కాగా, ఈసారి రూ. 126 కోట్ల మేర పెరిగాయి. ఇందులో బీపీఎస్ వసూళ్ల కింద రూ.72కోట్లు, ఎల్ఆర్ఎస్ వసూళ్లు రూ. 150కోట్లు, ప్రకటనల పన్నుపై రూ. 27కోట్లు సమకూరాయి. 

  • Loading...

More Telugu News