: 20న బీసీసీఐ అత్యవసర సమావేశం
ఈ నెల 20న బీసీసీఐ అత్యవసర సమావేశం జరుగనుంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా వాటి పై చర్చించాలని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో వివిధ రాష్ట్రాల క్రికెట్ సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు రవిసావంత్ తెలిపారు.