: ఎవరెస్ట్ ఎక్కుతూ, ‘ఆ ఐదుగురు’ ప్రాణాలు కోల్పోయారు!


హిమాలయాల్లో మంచు తుపాను వల్ల ఐదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ నుంచి మంచు చరియలు విరిగిపడటంతో వారు బస చేసిన క్యాంప్ పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది. ఈ క్యాంపు సముద్ర మట్టానికి సుమారు 21 వేల అడుగుల ఎత్తులో ఉంది. దీన్ని పర్వతారోహకులు పాప్ కార్న్ ఫీల్డ్ అని పిలుస్తారు. హిమసమాధి అయిన వారిని కాపాడేందుకు సిబ్బందిని హుటాహుటిన అక్కడికి తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఒక హెలికాఫ్టర్ కూడా రంగంలోకి దిగింది.

ప్రతి సంవత్సరం ఈ సమయంలో 29,035 అడుగుల ఎత్తైన ఎవరెస్టును ఎక్కేందుకు వందలాది మంది పర్వతారోహకులు ఈ బేస్ క్యాంప్ కి చేరుకుంటారు. 1953 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4000 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. తొలుత ఎవరెస్ట్ ను 1953లో న్యూజిలాండ్ కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్ కు చెందిన టెన్జింగ్ నార్గేలు అధిరోహించి జెండా ఎగురవేశారు. అప్పట్నుంచీ ఎవరెస్టును ఎక్కడం అన్నది పర్వతారోహకులందరికీ ఒక పెను సవాల్ గా ఉంటూ వస్తోంది.

  • Loading...

More Telugu News