: మన్మోహన్ మౌన ప్రధాని కాదంట
ప్రధాని మన్మోహన్ సింగ్ మౌన ప్రధాని అంటూ ప్రతిపక్ష నేతలు లోగడ చేసిన విమర్శలు నిజం కావంటున్నారు ఆయన సమాచార సలహాదారు పంకజ్ పచౌరి. గత పదేళ్లలో మన్మోహన్ సింగ్ వెయ్యికి పైగా ప్రసంగాలు చేశారని చెబుతున్నారు. ప్రధాని మాట్లాడలేదన్నది సరికాదని, మీడియా వల్లే ఆయన సందేశాలు ప్రజలకు చేరలేదన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.