: విజయమ్మ ప్రత్యర్థిగా రేపు నామినేషన్ వేస్తా: గంటా


వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రత్యర్థిగా రేపు నామినేషన్ వేస్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో టీడీపీ పొత్తు తమకు కలసిరాదని అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్టు గంటా చెప్పారు. బీజేపీ, టీడీపీ పొత్తు విషయం నేటి సాయంత్రానికి తేలిపోతుందని, అప్పుడు పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటానని గంటా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News