: బిడ్డ యోగక్షేమాలడిగి తెలుసుకున్న విజయమ్మ
మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఉన్న కుమార్తె షర్మిలను వైఎస్ విజయమ్మ కలుసుకున్నారు. కృష్ణా జిల్లా కనుమూరు గ్రామంలో పాదయాత్ర చేస్తోన్న షర్మిల యోగక్షేమాలడిగి తెలుసుకున్నారు. ఇదిలాఉండగా, నేటికి షర్మిల పాదయాత్ర 107వ రోజుకు చేరింది. జిల్లాలోని మంటాడ, గోపువానిపాలెం, కనుమూరు, కురుమద్దాలి, పామర్రు గ్రామాల మీదుగా నేటి షర్మిల పాదయాత్ర సాగుతోంది.