: నన్ను ఓడించడం టీఆర్ఎస్ తరం కాదు: డీకే అరుణ


తనను ఓడించడం టీఆర్ఎస్ తరం కాదని మాజీ మంత్రి, గద్వాల సిట్టింగ్ ఎమ్మెల్యే డీకే అరుణ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆమె హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 21న మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఇక ఎన్నికల సమరంలో డీకే అరుణ తనదైన శైలిలో ప్రజాభిమానం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

డీకే అరుణకి మద్దతుగా ఆమె ఇద్దరు కుమార్తెలు శృతిరెడ్డి, స్నిగ్థారెడ్డిలు కూడా ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. ప్రజలను కలుసుకుంటూ అరుణను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సేవకురాలిగా పదేళ్లలో అరుణ వ్యవహరించిన తీరును, ప్రజలకు అందుబాటులో ఉండే తీరును వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News