: టీడీపీతో పొత్తుపై రంగంలోకి దిగిన వెంకయ్య
టీడీపీతో పొత్తు వ్యవహారంపై చర్చించేందుకు భారతీయ జనతా పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. అలాగే సీమాంధ్ర ప్రాంతం బీజేపీ అధ్యక్షుడు కె.హరిబాబుతో పాటు వీర్రాజు కూడా ఇప్పటికే హైదరాబాదు చేరుకున్నారు. వారితో వెంకయ్య నాయుడు చర్చించి... మరికాసేపట్లో టీడీపీ పొత్తుపై బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
బీజేపీ, టీడీపీల పొత్తుపై ఆ రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చి, అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో సీట్లు సర్దుబాటు కూడా చేసుకున్నాయి. అయితే బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల విషయంలో టీడీపీ జోక్యం చేసుకోవడం పట్ల బీజేపీ ఒకింత అసహనంతో ఉంది. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ గురువారం హైదరాబాదు చేరుకుని తెలుగుదేశం పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన విషయం విదితమే.