: మన స్మృతిపథంలో 'సౌందర్య'మ్!
సినీ నటి సౌందర్య మననుంచి భౌతికంగా దూరమై నేటికి పదేళ్లు. ఆమె చనిపోయి పదేళ్లు పూర్తైనా సౌందర్య మన స్మృతిపథంలోంచి వెళ్లిపోలేందంటే కారణం, అందం... అభినయం...ఆహార్యం! పదహారణాల తెలుగమ్మాయిలా అనిపించే సౌందర్య బీజేపీ తరపున చెన్నమనేని విద్యాసాగర్ రావు కోసం ప్రచారం చేసేందుకు బెంగళూరు నుంచి కరీంనగర్ కి హెలికాప్టర్ లో వస్తూ ప్రమాదవశాత్తు అసువులు బాసింది.
పదేళ్ల క్రిందటి జరిగిన ఈ దుర్ఘటనను నేటికీ కరీంనగర్ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. సౌందర్య లేని లోటు సినీ రంగంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మోడీ ప్రభంజనం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సౌందర్య ఉండి ఉంటే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారానికి స్టార్ ప్రచారం అద్భుతంగా జరిగి ఉండేదని ఆ పార్టీ నేతలు కూడా గుర్తు చేసుకుంటున్నారు.