: రేపు విజయవాడలో నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి?
ఓవైపు టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు (సీమాంధ్ర ప్రాంతం) చర్చలు కొనసాగుతుండగానే... ఇరు పార్టీలు కూడా వారివారి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో, మొదటి నుంచి వార్తలకు కేంద్ర బిందువైన విజయవాడ మరోసారి తెరమీదకు వచ్చింది. బీజేపీ తరపున ఆ పార్టీ నాయకురాలు పురంధేశ్వరి విజయవాడ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. పురంధేశ్వరి బాటలోనే మరికొంత మంది బీజేపీ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సమాచారం హాట్ టాపిక్ గా మారింది.