: కేజ్రీవాల్ పై రాళ్ల వర్షం


ఆగంతుకులు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై దాడి చేశారు. నిన్న రాత్రి వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్ పై దుండగులు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటన వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్శిటీ సమీపంలో జరిగింది. దాడి సమయంలో దుండగులు... 'హర్ హర్ మోడీ, ఘర్ ఘర్ మోడీ' అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. సరైన సమయంలో పోలీసులు చేరుకోవడంతో కేజ్రీవాల్ కు ఎలాంటి హాని జరగలేదు.

  • Loading...

More Telugu News