: ఇప్పుడు అందరూ ఇన్ఫోసిస్ ని వదిలేస్తున్నారెందుకో!


దేశంలోని టాప్ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ కి ఇది కష్టకాలమే. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బాగా పేరు మోసిన, మోస్ట్ స్టేబుల్ ఇన్ఫోసిస్ ను ఇప్పుడు వదిలి వెళుతున్నారు. గతేడాది కాలంలో ఇన్ఫీ నుంచి 36,268 మంది బయటకు వెళ్లిపోయారు. అంటే 18.7 శాతం మంది సంస్థకు గుడ్ బై చెప్పారన్నమాట. ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిబులాల్ స్వయంగా అంగీకరించారు. తమాషా ఏమిటంటే, ఆయన కూడా ఇన్ఫీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.

సంస్థను వదిలిన వారిలో కేవలం 1.5 శాతం మందిని కంపెనీ తనంతట తానుగా తీసేసింది. మిగిలిన వారంతా తమకు తాముగా వదిలేసినవారే. బాలకృష్ణన్ వంటి సీనియర్ ఉద్యోగులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన దక్షిణ బెంగళూరు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభకు పోటీ చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఉద్యోగులు వదిలిపెట్టేసి పోకుండా ఉండేందుకు ఇన్ఫోసిస్ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయినా వలసలు మాత్రం ఆగడం లేదు.

  • Loading...

More Telugu News