: ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: భన్వర్ లాల్


ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ పేర్కొన్నారు. హైదరాబాదులో ఇవాళ సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా తనిఖీల్లో రూ.265 కోట్లు పట్టుబడితే ఒక్క మన రాష్ట్రంలోనే రూ.103 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. డబ్బు పంచిన వారు, తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని భన్వర్ లాల్ తెలిపారు. 70 కిలోల బంగారం, 300 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలకు నిన్నటివరకు 621 నామినేషన్లు దాఖలయ్యాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News