: నెట్ వాడడం ఇష్టం ఉండదంటున్న అంతర్జాతీయ సెలబ్రిటీ
గ్లోబలైజేషన్ లో ప్రపంచం కొట్టుకుపోతోంది. అలాంటి ప్రస్తుత రోజుల్లో నెట్ వాడను, నాకు ఇష్టం ఉండదు అని ఎవరైనా అంటే వింతగా ఉంటుంది. అదే సినిమా వాళ్లకు, సెలబ్రిటీలకు గాడ్జెట్లు, సరికొత్త సాంకేతిక వస్తువులు అందుబాటులో ఉండడంతో వాటిని వాడేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ హాలీవుడ్ స్టార్ జానీ డెప్ మాత్రం తాను కంప్యూటర్ వినియోగిస్తాను కానీ ఇంటర్ నెట్ కు దూరంగా ఉంటానని అన్నాడు.
తనకు ఇంటర్ నెట్ తో పరిచయం తక్కువ అని, తన కోసం తాను ఎప్పుడూ గూగుల్ లో శోధించలేదని అన్నాడు. నెట్ లో కనిపించే రూమర్స్ చూసి కలత చెందడం తనకు ఇష్టం ఉండదని తెలిపాడు. అయితే తన పిల్లలకు హోం వర్క్ లో సహాయం చేయడానికి కంప్యూటర్ వినియోగిస్తానని జానీ డెప్ తెలిపాడు. అలాగే తాను, సహనటి అంబర్ హర్ట్ తొందర్లో పెళ్లి చేసుకుంటున్నామని వెల్లడించాడు.