: బీజేపీతో పొత్తుపై టీడీపీ పునరాలోచించాలి: రాఘవులు
బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ పునరాలోచిస్తే బాగుంటుందని సీపీఎం జాతీయ నేత బీవీ రాఘవులు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ లాంటి మతతత్వపార్టీలు టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. చట్టసభల్లో నిజయతీగా వ్యవహరించే వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే వామపక్ష పార్టీలను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వామపక్ష పార్టీల మధ్య సానుకూలమైన చర్చలు నిర్వహించి, ఎన్నికల్లో ఐక్యంగా నడవడానికి ప్రయత్నం జరుగుతోందని ఆయన తెలిపారు.