: ఉత్తరప్రదేశ్ లో మధ్యాహ్నం వరకు 38 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్ లోని 11 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 స్థానాల్లో మొత్తం 150 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు 38 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొరాదాబాదులో 39.54 శాతం, రాంపూర్ లో 36.42 శాతం, సంభాల్ లో 46 శాతం, అమ్రెహాలో 40.90 శాతం, బదౌన్ లో 33.60 శాతం, ఓన్లాలో 38 శాతం పోలింగ్ నమోదైంది.