: కేసీఆర్ మీద దుబాయ్ లో కేసులున్నాయి: పొన్నాల
కేసీఆర్ పై పొన్నాల లక్ష్మయ్య మరోసారి విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు భారత రాజ్యాంగం, చట్ట సభలపై నమ్మకం లేనట్టుందని అన్నారు. అందుకే ఉద్యోగుల విభజనపై కేసీఆర్ రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల బదిలీపై అనుమానాలు ఉన్నట్టైతే పార్లమెంటులో తన అభ్యంతరాలను ఎందుకు లేవనెత్తలేదని ఆయన ప్రశ్నించారు.
కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఉద్యోగులు పట్టించుకోవద్దని ఆయన తెలిపారు. కేసీఆర్ తప్పులను ఎత్తి చూపుతుండడం వల్ల టీఆర్ఎస్ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ పై దొంగపాస్ పోర్టు, మనుషుల అక్రమ రవాణాపై కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులపై ఏ ప్రభుత్వ సంస్థ కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.