: ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది..!


‘కుక్కపిల్ల... సబ్బుబిళ్ల... అగ్గిపుల్ల... కాదేదీ కవితకు అనర్హం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఫేస్ బుక్, యూ ట్యూబ్, వాట్స్ యాప్... కాదేదీ ప్రచారానికి అనర్హం అంటున్నారు అభ్యర్థులు. యువ ఓటరు నాడిని పట్టేందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. నేటి తర ప్రచార వేదికగా నిలిచిన సామాజిక ప్రసార మాధ్యమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఎప్పుడూ ‘ఆన్ లైన్’లోనే ఉండే ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నారు.

ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు తమ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. పట్టణ వాసులు, యువతీ యువకులు, సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు, మహిళలు, వ్యాపారులు... ఇలా ఎవరినీ వదలకుండా తమ ప్రచార వ్యూహాన్ని రచించుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ లతో నేటి యువత సోషల్ నెట్ వర్క్ సైట్లను విరివిగా వాడుతుండటంతో దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. సెల్ ఫోన్లలో యువత అత్యధికంగా ఉపయోగించే ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ అప్లికేషన్ ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News