: బెంగళూరు, ఢిల్లీ హోరాహోరీ నేడు


ఐపీఎల్ 7 లో భాగంగా ఈరోజు షార్జాలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడనుంది. కాగా మ్యాచ్ ఫేవరేట్ గా బెంగళూరు బరిలో దిగుతుంది. మ్యాచ్ కు ముందే ఢిల్లీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పీటర్సన్ గాయం కారణంగా తొలి మ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వైస్ కెప్టెన్ దినేష్ కార్తీక్ నేతృత్వంలో ఆ జట్టు బరిలోకి దిగనుంది. కాగా కోహ్లీ, గేల్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో బెంగళూరు బలంగా ఉంది. గతంలో ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించిన సెహ్వాగ్ బెంగళురు నుంచి బరిలోకి దిగనుండడంతో ఆయన ఎలా ఆడతాడోనన్న ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News