: టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ


టెలికాం కంపెనీలు జీర్ణించుకోలేని తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ప్రైవేటు టెలికాం కంపెనీల ఖాతాలను కూడా ఆడిట్ చేయవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో గతంలో టెలికాంశాఖ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. ప్రైవేటు కంపెనీలు జాతీయ సంపదను వినియోగించుకుంటున్నాయని ధర్మాసనం పేర్కొంది. స్పెక్ట్రమ్ అనేది జాతి సంపదని, దాన్ని వినియోగించుకుని సర్వీసులు ఆఫర్ చేస్తున్నందున... వాటి లాభ, నష్టాలను ఆడిట్ చేసే అధికారం కాగ్ కు ఉంటుందని స్పష్టం చేసింది. లోగడ ఢిల్లీ హైకోర్టు కూడా ఇదేవిధమైన తీర్పునిచ్చింది. దానిపై టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడా వాటికి చుక్కెదురైంది.

  • Loading...

More Telugu News