: న్యాయంగా ఆడండి...వినోదం పంచండి: గవాస్కర్


ఐపీఎల్ లో ఆటగాళ్లు న్యాయంగా ఆడాలని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ సూచించారు. దుబాయ్ లో ఆయన మాట్లాడుతూ, క్రికెట్ ను ఆటగా చూడొద్దని క్రికెటర్ల జీవితాలు అందులో మిళితమై ఉన్నాయని అన్నారు. ఆటగాళ్లు అవాంఛిత కార్యకలాపాలకు దూరంగా ఉండి, న్యాయంగా ఆడాలని సూచించారు. అభిమానులకు పసందైన క్రీడా విందు పంచాలని ఆయన ఆకాంక్షించారు. అభిమానులను కోల్పోతే క్రికెట్ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని, అలాంటి పరిస్థితి రానీయొద్దని గవాస్కర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గవాస్కర్ బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. క్లీన్ చిట్ వచ్చే వరకు శ్రీనివాసన్ బీసీసీఐ కార్యకలాపాల్లో పాల్గొనరాదని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో శ్రీనివాసన్ ఐపీఎల్ కు దూరంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News